శ్రీ వెంకటేశ్వర గానామృతము
(గోవిందుడు పలికించిన పలుకులు)
(గోవిందుడు పలికించిన పలుకులు)
భగవత్ స్వరూపులైన పాఠకులకు హృదయపూర్వక వందనములు. నేను పెద్ద చదువులు చదువలేదు. ఎటువంటి విద్య నేర్పలేదు. ఎటువంటి పాండిత్యము న కడలేదు. మా ఇంటి ఇలవేల్పు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తితో కొలుచుటయే నాకు తెలిసిన విద్య. ఒక శనివారమూ నాడు మా స్వగృహంమందు ఉన్న దేవుని మందిరము నందు స్వామికి దీపారాధన చేసి ధ్యానము చేసుకుంటున్న సమయములో నా మదిలో శ్రీవేంకటేశ్వరస్వామి లీలలు మొదిలినవి. చాలా మధురముగా ఉన్న ఆ పదాలను కుర్చీ వ్రాయగా శ్రీ వెంకటేశ్వర గానామృతంగా 335 చరణాలు రూపు దాల్చినవి. నా భర్త శ్రీయుత అప్పల బాలయ్య గారు ప్రతి చరణము ఆలకించి మధురముగా ఉన్నది అని నన్ను ఎంతగానో ప్రోత్సహించినారు. మా గురువుగారు, మా ఆత్మీయ, అభిమాన,గౌరవనీయులు, సరస్వతి పుత్ర,సహస్రపద్మ,ప్రణవ పీఠాధిపతి,త్రిభాషా మహాసహస్రావధాని,వాగ్దేవి వర పూతురులైన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు మేము కోరిన వెంటనే వారి యొక్క మంగళాశాసనము మాకు లభించుతామనేది మా భాగ్యంగా భావించి చాల సంతోషముతో మా దంపతులు ఇరువురము కుతజ్ఞతను తెలిపుకొనుచున్నాము.
మా శ్రేయోభిలాషి, మా ఆత్మీయులు, చీర పరిచితులు అయినా శ్రీ కవి పండితులు, తెలుగు పండిత్ గౌరవనీయులు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిదిన మహనీయులు శ్రీ అనగాని సౌభాగ్యారావుగారు నాచేత గోవిందుడు వ్రాయించిన శ్రీ వెంకటేశ్వర గానామృతమును అక్షర దోషము లేకుండ తీర్చిదిదిన మహనీయులు. మేము కోరిన వెంటనే వారి యొక్క శుభాశీసులు మాకు లభించుట మా అదృష్టముగా భావించుచున్నాము .
మా దంపతులు ఇరువురము వారికీ మా కృతఙ్ఞతలు తెలుపుకొనుచున్నాము.
మా దంపతులు ఇరువురము వారికీ మా కృతఙ్ఞతలు తెలుపుకొనుచున్నాము.
ఈ వెంకటేశ్వర గానామృతము విశ్వమంతా భక్తుల మదిలో వటవృక్షములుగా వ్యాపించాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని సదా ధ్యానిస్తూ .....
అలివేలుమంగా పద్మావతి సమేత
శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తురాలు
అప్పల బాలరత్నం
1 -3 -2006